ఆ సినిమాలో నెగిటివ్ రోల్ లో చెయ్యడానికి రెడీ అయిన రవితేజ..!?

Anilkumar
ఒక హీరోకి ఒక సినిమా హిట్ పడితే చాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకే ముందు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కంటే ముందే సక్సెస్ తరువాత అన్ని లెక్కలు వేస్తూ ఉంటారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ దాని అనంతరం రెండు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలో ఫ్లాప్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు సినిమాల ఫ్లాప్ల అనంతరం తాజాగాధమాకా సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్టును తెచ్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 

ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ రావణాసుర సినిమాతో పాటు స్టువర్ట్ పురం గజదొంగగా పేరు ఉన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో సైతం నటిస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా ముందుగా రావణాసుర సినిమాతో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు రవితేజ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు తో పాటు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాని కూడా చేసే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించి మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 ఈ నేపథ్యంలోని ఇదే తరహాలో మరో మల్టీ స్టార్ కు కూడా రవితేజ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 2021 నవంబర్ 25న విడుదలై సంచలనం సృష్టించిన సినిమా మానాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని తెలుగులో రవితేజ మరియు సిద్దు జొన్నలగడ్డతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ అయిన ఇయర్స్ సూర్య   క్యారెక్టర్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే రవితేజ చెప్పడంతో ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చిందట. ఇక మార్పులు చేసిన అనంతరం రవితేజ ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ నచ్చకపోతే రవితేజ మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: