మా గురించి తప్పుడు కథనాలతో..వ్యాపారం చేస్తున్నారు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్..!
సుప్రీత మాట్లాడుతూ మా కుటుంబం గురించి మా గురించి కొన్ని రూమర్స్ సృష్టించి మా కన్నీటిని కూడా కొంతమంది క్యాష్ చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారని ఎమోషనల్ గా మాట్లాడింది. ఒకానొక దశలో ఈ రూమర్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యిందని కానీ ఇప్పుడు ఆ నెగటివీటిని తట్టుకునే ధైర్యం ఏర్పరచుకున్నానని తెలియజేసింది. గతంలో తాను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా తెలియజేస్తూ, తాను తెలియక చేసిన తప్పు అందుకే ఇకమీదట అలాంటి పొరపాటు చేయకూడదని ఏ ప్రమోషన్స్ అయినా సరే లాయర్ సలహా తీసుకున్న తర్వాతే మళ్ళీ చేస్తున్నానని తెలియజేసింది.
తల్లి సురేఖ వాణి రెండవ పెళ్లి పైన మాట్లాడుతూ.. తన తల్లి రెండో పెళ్లి అనేది కేవలం నా కోరిక మాత్రమేనని, తల్లి సురేఖ కి మాత్రం రెండవ పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదంటూ తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయి నెపోటిజం వల్ల మొదటిలో అవకాశాలు వచ్చిన ఆ తర్వాత నటిగా నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో నిలబడతానంటూ సుప్రీత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సురేఖ వాణి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.