ఇప్పుడు స్పందించకపోతే బాలయ్య పరువు కాలువపాలే..!

Divya
సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలకృష్ణ. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలయి భారీ హిట్ టాకుతో దూసుకుపోయిన నేపథ్యంలో గత ఆదివారం వీర సింహునివిజయోత్సవం పేరిట భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం . ఈ క్రమంలోని స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడుతూ గత విషయాలను కూడా పంచుకున్నాడు ఈ క్రమంలోనే అక్కినేని తొక్కినేని అనే డైలాగు రావడంతో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో బాలయ్యను విమర్శిస్తున్నారు. సినిమా పరిశ్రమకు మూల స్తంభం అయిన అక్కినేని నాగేశ్వరరావును ఇలా అనడం ఏమాత్రం పద్ధతి కాదు అంటూ అక్కినేని అభిమానులు సైతం ట్వీట్ల రూపంలో తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అక్కినేని అభిమానులు మాత్రమే కాదు అక్కినేని వారసులు కూడా ఈ విషయంపై స్పందించారు.  అక్కినేని నాగచైతన్య , అక్కినేని అఖిల్ కూడా తమ ట్విట్టర్ వేదికగా నందమూరి తారక రామారావు గారు,  ఎస్వీ రంగారావు గారు,  అక్కినేని నాగేశ్వరరావు గారు ముగ్గురు కూడా కళామతల్లి ముద్దుబిడ్డలే.  ఇలాంటి వారిని గౌరవించడం మన సంస్కారం.. వీరిని అవమానిస్తే మనల్ని మనం కించపరచుకున్నట్టే అంటూ అక్కినేని వారసులిద్దరూ కూడా స్వీట్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులైతే పూర్తి స్థాయిలో బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాలి అంటూ కూడా తెగ వైరల్ చేస్తున్నారు.
తమ తాత గారిని బహిరంగంగా అలా తక్కువ చేసి మాట్లాడినా కూడా అక్కినేని వారసులిద్దరూ కూడా ఏమాత్రం సహనం కోల్పోకుండా చాకచక్యంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.  ఇలాంటి సమయంలో బాలయ్య కూడా ప్రతిస్పందించడం తప్పనిసరి. అలా అన్నందుకు బాలకృష్ణ అక్కినేని గారికి క్షమాపణలు చెప్పాల్సిన సమయం వచ్చింది.  ఒకవేళ ఆయన చెప్పకపోతే ఇంతకాలం సంపాదించుకున్న క్రేజ్ మొత్తం కాలువలోకి పోతుంది అనడంలో సందేహం లేదు. మరి ఇప్పటికైనా బాలయ్య స్పందిస్తారో లేదో అని అభిమానుల సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: