బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించి చాలా కాలం అయ్యింది. షారుక్ నటిస్తున్న ఈ మూవీ ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఇక ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్స్ ఇంకా అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్ మూవీలోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆ అభ్యంతరకమైన సీన్లను తొలగించాలని యూనిట్‌ను సెన్సార్ బోర్డు ఇప్పటికే ఆదేశించింది.ముఖ్యంగా ఇందులో దీపికా పదుకొనే వేసుకున్న దుస్తులు, వీరి మధ్య పాటను షూట్ చేసిన విధానం అభ్యంతరకరంగా ఉందంటూ హిందూ సంఘాలు ఎంతగానో మండిపడుతున్నాయి.
ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే భేషరమ్ రంగ్ సాంగ్ ని సినిమా నుంచి తొలగించాలని కొందరు బాగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇదిలా ఉంటే సెన్సార్ బోర్డు మూవీలోని కొన్ని సీన్స్ ను కట్ చేసిందని సమాచారం తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.రన్‌టైమ్ వచ్చేసి 2గంటల 26 నిమిషాల 16 సెకన్లు ఉంటుంది. ఇక భేషరమ్ రంగ్ సాంగ్ పాటలో సెన్సార్ బోర్డు మొత్తం మూడు కట్స్ చెప్పిందట. దీపిక గోల్డెన్ స్విమ్ సూట్లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్ ని కూడా తొలగించామన్నారట..ఇంకా అలాగే ఆ పాటలో డ్యాన్స్ మూమెంట్స్‌లో కూడా మార్పులు చేయమన్నారట. ఇక సినిమాలో మొత్తం పది కట్స్ చెప్పారట సెన్సార్ బోర్డు. దాంతో ఇప్పుడు సినిమాని రీ షూట్స్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ మూవీని జనవరి 25న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ అయ్యారు.