#NTR 30 లో ధమాకా హీరోయిన్ ఫిక్స్..!
కానీ ఎట్టకేలకు కొరటాల శివకు చెప్పి.. స్క్రిప్ట్ పూర్తిగా మార్చేయాలని అప్పుడే తన సినిమాలో నటిస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గట్టుగా కథను తయారు చేశాడు అని.. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలబడలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ లీలా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
పెళ్లి సందడి మూవీతో భారీ క్రేజ్ అందుకున్న ఈమె ఆ తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రవితేజతో ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమాలో కూతురి పాత్రలో అవకాశాన్ని దక్కించుకోగా.. మరొకవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.