గతేడాది విడుదలైన డీజే టిల్లు సినిమాతో ఈ సినిమా హీరో అయిన సిద్దు జొన్నలగడ్డకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అతి తక్కువ బడ్జెట్ తో 2022లో చాలా చిన్న సినిమాగా ఈ సినిమా విడుదలైంది.చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో సిద్దు నటనకు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దీపావళికి వచ్చింది.
అయితే ఈ సినిమా సీక్వెల్ లో హీరోయిన్ ఎవరు అని రకరకాల వార్తలో వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది అని సోషల్ మీడియా వేదికగా వార్తలు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. దాని అనంతరం ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది అని వార్తలు రావడం జరిగింది. దీంతో అనుపమ స్థానంలో మరికొందరు హీరోయిన్ల పేరు కూడా గతంలో వినిపించాయి.ఈ నేపథ్యంలోని హిట్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని.. దాని అనంతరం ఈమె కూడా ఈ సినిమా నుండి తప్పుకుంది అని..
తరువాత ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల కూడా నటిస్తుంది అన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఆమె కూడా ఈ సినిమా నుండి తప్పుకుంది అని పలు రకాల వార్తలో రావడం జరిగింది.అయితే తాజాగా ఈ వార్తలపై ఇన్నాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమా సీక్వెల్లో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది అని తెలుస్తుంది. ఇక తాజాగా దీనికి సంబంధించి అనుపమ పరమేశ్వరం ఒక పోస్టుని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వార్తలకి బ్రేక్ పడింది. ఇక ఇందులో భాగంగానే అనుపమ పరమేశ్వరం సెట్స్ లో అడుగుపెట్టి సిద్దు జొన్నలగడ్డ జుట్టుకు జల్ రాస్తూ ఆ ఫోటోలో కనిపించింది. అంతేకాకుండా ఇది ప్రత్యామ్నాయ వృత్తి అని ఒక వీడియోను కూడా షేర్ చేసింది అనుపమ. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ ఫిక్స్ అయ్యింది అని అందరికీ క్లారిటీ వచ్చింది..!!