హనుమాన్ రిలీజ్ డేట్ లాక్..!

Divya
తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్య సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ వదిలారు. ఈ సినిమా మే 12వ తేదీన తెలుగు , కన్నడ, మరాఠీ ,హిందీ, మలయాళ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా భారత్ తో పాటు చైనా, అమెరికా, యు కె ,జపాన్ ,ఆస్ట్రేలియా, శ్రీలంక, జర్మనీ ,మలేషియా వంటి దేశాలలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
హనుమంతుడు అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడు అనేది సినిమా కథ.  ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్.. వెన్నెల కిషోర్,  గెటప్ శ్రీను, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయిన హనుమాన్ టీజర్ లో విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి ప్రేక్షకులలో మరింత ఆసక్తిని నెలకొల్పుతున్నారు చిత్రబృందం.
సమ్మర్ లో సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో చూపించిన క్రియేటివిటీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.  ప్రభాస్ ఆది పురుష్ టీజర్ కంటే గొప్పగా ఉందనే పేరు కూడా తెచ్చుకుంది.  ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా మరింత విజయం సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.  ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ మరింత ఆకర్షణగా నిలిచింది. వరల్డ్ మ్యాప్ రిలీజ్ చేస్తూ అందులో హనుమంతుడిని చూపిస్తూ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ లో చూపించడంలో ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమా మంచి హిట్ కొట్టేటట్టు కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: