గోపీచంద్ నటించిన ఆ సినిమాను.. బాలయ్య మూడుసార్లు చూశాడట తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎక్కడ చూసినా అన్ స్టాపబుల్ మేనియానే ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. దీనికి అంతటికి కారణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాప బుల్ కార్యక్రమానికి రావడమే. సాధారణంగా ఎలాంటి టాక్ షోలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపని ప్రభాస్ మొదటిసారి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్  షో కి వచ్చి తనదైన శైలిలో సందడి చేశాడు. ఈ క్రమంలోనే ఇక ఇందుకు సంబంధించి విడుదలైన రెండు ఎపిసోడ్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టిస్తున్నాయి.

 ఇకపోతే ఇప్పటికే స్రీమింగ్ అయిన మొదటి ఎపిసోడ్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఓటీపీ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎరుగని సరికొత్త రికార్డులను సృష్టించింది. అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ల మినిట్స్ తెచ్చుకుంది బాహుబలి ఎపిసోడ్. అయితే బాహుబలి పార్ట్ 2 కూడా ఇటీవల రిలీజ్ అయింది. అయితే మొదటి పార్ట్ లో లేని ఫన్ మొత్తాన్ని కూడా అటు సెకండ్ పార్ట్ లో నింపేశారు అని చెప్పాలి.ఇక సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు అతని స్నేహితుడు స్టార్ హీరో గోపీచంద్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలను ఆసక్తికర ప్రశ్నలు అడిగిన బాలకృష్ణ ఎన్నో విషయాలను తెలుసుకున్నారు.

 ఈ క్రమంలోనే గోపీచంద్ సినిమాల గురించి మాట్లాడుతూ గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాను తాను మూడుసార్లు చూశాను అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇక ఆ సినిమా తనకు పిచ్చపిచ్చగా నచ్చేసింది అంటూ తెలిపాడు బాలయ్య. జిల్ సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండీ మేకవర్ తనకు ఎంతగానో నచ్చిందంటూ తెలిపాడు. అయితే వెంటనే స్పందించిన గోపీచంద్.. జిల్ సినిమాలో తన స్టైలిష్ లుక్కు వెనుక ప్రభాస్ ఉన్నాడని అతనికి పూర్తి క్రెడిట్ దక్కుతుంది అంటూ  తన స్నేహభావాన్ని చాటుకున్నాడు అని చెప్పాలి. రెగ్యులర్ గా కాకుండా జిల్ సినిమా కోసం లుక్స్ మార్చుకోవాలని ప్రభాస్ సలహా ఇవ్వడంతోనే ఆ దిశగా ట్రై చేసా ఇక ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: