అవికా గోర్ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున.. !?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తన 'ఘోస్ట్' సినిమా తర్వాత ఎక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం లేదు. భారీ అంచనాలను విడుదల ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో నాగ్ తన తదుపరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా హీరోయిన్ అవికా గోర్ కి సంబంధించిన ఒక షాకింగ్ సీక్రెట్ ని బయటపెట్టాడు నాగార్జున. అవికా గోర్ 10 సంవత్సరాల క్రితమే పాన్ వరల్డ్ హీరోయిన్ అని అసలు విషయం చెప్పేసాడు. దీంతో నాగార్జున రివీల్ చేసిన ఈ  సీక్రెట్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. 

'చిన్నారి పెళ్లికూతురు' అనే సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది అవికా గోర్. ఈ సీరియల్ ఇండియాలోనే చాలా భాషల్లో రీమేక్ చేశారు. అలా ఈ సీరియల్ రీమేక్ అవడం వల్ల అవికా గోర్ కి భారీ పాపులారిటీ వచ్చింది. ఇక దాని అనంతరం ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు వెండితెరకు  హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఇక తాజాగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన చిత్రం 'పాప్ కార్న్'. మురళీ గంధం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి రోనక్ హీరోగా నటించాడు.

ఇక ఈ సినిమా ట్రైలర్ను బుధవారం నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అవికా గోర్ గురించి నాగార్జున మాట్లాడుతూ.." పది సంవత్సరాల క్రితం నేను రియో సిటీకి వెళ్లాను. ఆ సిటీలో ఓ స్టూడియో చూద్దామని వెళ్తే ఆ స్టూడియోలో అవికా ఫోటో కనిపించింది. ఇక ఆ ఫోటో గురించి అడిగితే చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ని వాళ్లు కూడా డబ్ చేసి రిలీజ్ చేశారని.. అక్కడ పెద్ద హిట్ అయిందని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ 128 దేశాల్లో డబ్ అయింది. ఇప్పుడు మనమంతా కూడా పాన్ ఇండియా స్టార్స్ అని అంటున్నాం కానీ పదేళ్ల క్రితమే అవికాగోర్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిందని నాగార్జున తెలిపారు. అంతేకాదు అవికా గోర్ కజకిస్తాన్లో ఏకంగా రెండు సినిమాల్లో నటించిందని చెప్తూనే అవికా సాధించిన ఘనత మామూలు విషయం కాదంటూ నాగార్జున పేర్కొన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: