టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు సీనియర్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సుధ. ఒకప్పుడు ఈమె తల్లి పాత్రలు చేసి మంచి గుర్తింపును పొందింది. అయితే గత కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన ఈమె ఎన్టీఆర్ ,కృష్ణ వంటి అగ్ర హీరోల నుండి నేటితరం రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలలో సైతం నటించింది ఈమె. అయితే గత కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
ఈమె మాట్లాడుతూ తల్లి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడను.. ఇప్పటివరకు నేను నటించిన అన్ని సినిమాలలోనూ ప్రతిపాత్రను ఇష్టపడుతూ నటించాను.. తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టిన సమయంలో నా తోటి నటీమణులు.." సుధా నువ్వెందుకు తల్లి పాత్రలు చేస్తున్నావో నువ్వు ఇలా చేస్తే రేపు మమ్మల్ని కూడా ఆ పాత్రలకు అడుగుతారు" అని చెప్పారు. ఇక ప్రముఖ దర్శకుడు బాలా చందర్ వల్ల నేను ఈరోజు నటిగా ఉన్నాను.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన చాలా సందర్భాల్లో "నన్ను నీ మొహం గ్లామర్ రోల్స్ కు పనికిరాదు హీరోయిన్గా నువ్వు చేయలేవు..
కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే బాగుంటుంది.. నేను చేయబోయే ఒక సినిమాలో హీరోయిన్ సోదరి పాత్ర ఉంది నువ్వు చేస్తా అంటే చెప్పు "..అని చెప్పుకొచ్చాడు. అలా నేను ఈ పాత్రలు చేయడానికి ముందడుగు వేశాను. గతంలో తల్లి పాత్రలు చాలా బాగుండేవి కానీ ఇప్పుడు తల్లి పాత్రలు మాత్రం నాకు అస్సలు నటించడం లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాలలో తల్లి పాత్ర పూర్తి స్థాయిలో బాగా ఉండడం లేదు. సరైన డైలాగ్ లు ఉండడం లేదు.ఒకప్పుడు తల్లి పాత్ర అంటే ఎన్నో డైలాగులు ఉండేవి. చాలా అద్భుతంగా స్క్రీన్ పై కనిపించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు.అందుకే తల్లి పాత్రలకు దూరంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది సుధ..!!