తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విజయ్ ఈ సంవత్సరం టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించి మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
అలా బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను ఈ సంవత్సరం అలరించిన విజయ్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వారిసు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ తెలుగులో వారసుడు పేరుతో విడుదల కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించగా ... రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
అంతకు ఒక రోజు ముందుగానే అనగా జనవరి 11 వ తేదీనే ఈ మూవీ ని యూఎస్ఏ లో ప్రీమియర్స్ వెయ్యనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యొక్క యూఎస్ఏ ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ కూడా మొదలు అయ్యాయి. ఈ మూవీ ని మొత్తంగా యూఎస్ఏ లో 53 లోకేషన్ లలో ... 129 షో లు వేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఆన్లైన్ బుకింగ్ లు కూడా మొదలు కాగా ... ఈ మూవీ యొక్క 980 టికెట్ లు కూడా అమ్ముడుపోయాయి. వాటి ద్వారా ఈ మూవీ కి 20 కే గ్రాస్ కూడా లభించింది. ఇలా ప్రస్తుతం ఈ మూవీ కి యూఎస్ఏ లో మంచి ఫ్రీ సేల్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే వారిసు మూవీ పై విజయ్ అభిమానులతో పాటు ... తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.