చెన్నై బ్యూటీ త్రిష గురించి అందరికి తెలుసు..తమిళ సినిమాల నుంచి తెలుగు సినిమాల వైపు మొగ్గు చూపింది..అక్కడా, ఇక్కడ మంచి మార్కెట్ ను ఏర్పరుచుకుంది.. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది..అయితే ఈ మధ్య తెలుగు సినిమాల లో పెద్దగా కనిపించలేదు. తమిళ సినిమాలకు మాత్రమే అంకితమైంది..ఇకపోతే త్రిష గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది..ఆ మధ్య రాజకీయాల్లోకి వెలుతుందని వార్తలు వినిపించాయి..దానిపై తాజాగా ఈ అమ్మడు క్లారిటి ఇచ్చింది.
అసలు తనకు రాజకీయాల్లోకి వెళ్ళే ఆశ లేదని తేల్చి చెప్పింది.. రాజకీయల వైపు అనే ఆలోచన కూడా నాకు లేదని తెల్చి చెప్పింది. జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకి అంకితం చేయగలిగితేనే రాజకీయాల్లోకి వెళ్లాలని త్రిష అభిప్రాయపడ్డారు. అంత ఓపిక, ధైర్యం నాకు లేవన్నారు. ఈ సందర్భంలో త్రిష సహా చిత్రబృందం ‘రంగీ’ ప్రమోషన్ వర్క్ కోసం ప్రెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో త్రిష మాట్లాడుతూ..ఈ రంగుల తెరపై 20 ఏళ్లుగా ఉన్నాను. అయితే తన పై వచ్చే నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఆ సమాచారం ఒక్క శాతం కూడా నిజం కాదు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎప్పుడు పెళ్లికి దూరంగా ఉండడం మంచిదని బదులిచ్చారు.
ఎం.శరవణన్, త్రిష నటించిన `రాంకీ`కి దర్శకత్వం వహించారు. సినిమాలో పలు వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించింది.దాని అప్పీల్‌పై సెన్సార్ బోర్డు లోని 30 సీన్లను తొలగిస్తూ ‘యూఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం 'రంగీ' ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది. డిసెంబర్ 30న థియేటర్లలోకి రానుంది.అయితే గతంలో కూడా రాజకీయాల్లోకి వస్తారా అంటూ అభిమానులు ప్రశ్నించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఇంకా పటిష్టమైన చట్టాలు అవసరమని త్రిష అన్నారు..ప్రభుత్వ వాటి పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు..