కాంతారకు 400 కోట్ల కలెక్షన్స్.. ఇంతకీ రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

praveen
చిన్న సినిమగా వచ్చి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది కాంతర సినిమా. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు.  కాంతారా సినిమా తర్వాత రిషబ్ శెట్టి పేరు తెలియని వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా కన్నడ మూవీ గా వచ్చిన కాంతర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించి 400 కోట్ల వసూలు సాధించింది అని చెప్పాలి. కేవలం 16 కోట్ల  బడ్జెట్ తో తెరకెక్కిన  కాంతారా సినిమా ఓటిటి, శాటిలైట్ రైట్స్ లాంటివి కాకుండా థియేటర్ల ద్వారా 406 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

 అయితే భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శక నిర్మాతలు అందరూ కూడా కాంతారా బ్లాక్ బస్టర్ విజయంతో షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా 16 కోట్లతో తెరకెక్కిన  కాంతార సినిమాలో నటీనటులు  ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దర్శకుడిగా హీరోగా సినిమాకు పనిచేసిన రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోని ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల పారితోషకం ఎంతో తెలుసుకుందాం.

 కాంతారా సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా కీలకపాత్రలో నటించిన కిషోర్, రిషబ్ శెట్టి సరసన హీరోయిన్గా నటించిన సప్తమి గౌడ కు  కోటి రూపాయల పారితోషికం చెల్లించారట. ఇక రాజుకు వారసుడు పాత్రలో కనిపించిన అచ్యుత్ కుమార్ కు 40 లక్షలు ఇచ్చారట. సుధారక పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టి 40 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నాడట. ఇక ఈ సినిమాకు వెన్నుముక అయిన రిషబ్ శెట్టి ఏకంగా నాలుగు కోట్ల పారితోషకం తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో నిర్మాతలు మరికొంత పారితోషికం రిషబ్ శెట్టికి అందించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: