ఎన్టీఆర్-కొరటాల సినిమ టీజర్ వచ్చేది అపుడేనట..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపును పొందాడు. ఆ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఇప్పటివరకు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించలేదు. కొరటాల శివతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు అని ఎప్పుడో ప్రకటించారు. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. ఇక పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ఎన్టీఆర్ కోసం కొరటాల శివ అంతకముందు మామూలు సబ్జెక్టు సిద్ధం చేశాడు. ఇక ఆ కథ కాకుండా పాన్ ఇండియా స్థాయి కథతో మళ్లీ ఎన్టీఆర్ ని కలుస్తాను అని కొరటాల శివ 

చెప్పినట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు.. అంతేకాదు దానికోసం కొరటాల శివ కి ప్రత్యేకమైన టీం ని కూడా ఏర్పాటు చేసి స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశారు. దాని అనంతరం ఎన్టీఆర్ కి ఆ కథ బాగా నచ్చడంతో చేయడానికి ఫిబ్రవరి నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక సంక్రాంతి రోజున ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలతో.. అదే రోజు సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ని కూడా సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇక ఈ సినిమా అండర్ వాటర్ నేపథ్యంలో కొనసాగుతుందని భారీ రియాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సౌత్ ఇండియన్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఫైనల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇక ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమా తరువాత ఎలా అయినా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలి అనే రేంజ్ లో కొరటాల ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: