టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఇప్పుడు ఓ సినిమా ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది .అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ తల్లి పాత్ర కోసం కొరటాల శివ ఏకంగా విజయశాంతిని తీసుకుంటున్నారు అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా వైరల్ అవుతున్నాయి. అయితే కొరటాల శివ ఇప్పటికే విజయశాంతిని కూడా సంప్రదించాడని క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండడంతో..
విజయశాంతి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి తల్లిగా నటించడానికి ఒప్పుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కోసం విజయశాంతిని కొరటాల ఎంపిక చేసుకోవడం ఇప్పుడు వైరల్ అవుతుంది .అయితే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా తెరకించే ప్లాన్ లో ఉన్నాడట కొరటాల. అయితే అందుకే ఈ సినిమా కోసం నటీనటుల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటించబోతుంది. ఇక ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జత కడితే ఆ స్క్రీన్ విజువల్స్ ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. జాన్వి కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ కి దగ్గరయ్యాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ తో విజయశాంతి నటించిన ఎలా ఉంటుంది అని తెగ ఎదురు చూస్తున్నారు విరి అభిమానులు .అయితే మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకి ఇప్పుడు భారీ క్రేజ్ ఏర్పడింది అనే చెప్పాలి.ఇక ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఖర్చు కూడా పెడుతున్నట్లుగా తెలుస్తుంది .ఇక ఇందులో భాగంగానే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకుంటున్నారు అని వార్తలు సైతం ఇప్పుడూ వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంది..!!