NTR -30 చిత్రంలో సీత..!!

Divya
సీతారామం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. తెలుగులో ఈమెకు ఇదే మొదటి చిత్రం. బాలీవుడ్ నుంచి తెలుగులోకి అనువాదమైన కొన్ని సీరియల్స్ లో కూడా మృణాల్ ఠాగూర్ నటించింది. కేవలం సీతామహాలక్ష్మిగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా సీతారామం చిత్రంలో ఎంత అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె అందానికి అభినయానికి యువత మొత్తం దాసోహం అయ్యారు సీత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికీ ఎన్నో నెలలు కావస్తోంది.ఇప్పటికి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ సినిమాపై మరింత శ్రద్దని పెట్టడం జరిగింది. ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు.

కానీ హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదని కాకపోతే పలువురు హీరోయిన్ల గురించి చర్చిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆలియా భట్, జాన్వి కపూర్, శ్రీ లీల కీర్తి సురేష్ తదితర పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మృనాల్ ఠాగూర్ నటించబోతోంది అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈమెను వద్దంటున్నట్లుగా సమాచారం. మరి ఎన్టీఆర్ దర్శనం మృణల్ ఠాగూర్ అనే వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సి ఉంది. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో నందమూరి అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: