సల్మాన్ తో ప్రేమలో ఉన్న స్టార్ నటి... నిజమా...??

murali krishna
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ ప్రేమలో పడటం అనేది చాలా కామన్. కలిసి సినిమాలో నటించే క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమలో పడుతుంటారు. మరి ఆ ప్రేమ నిజమైనదా కాదా అనేది క్లారిటీ అనేది ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూలో చెబితేగాని రావట్లేదు. అయితే.. ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టివేస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడంటూ వార్తలు జోరందుకున్నాయి.
మరి సల్మాన్ తో ప్రేమలో పడిన హీరోయిన్ ఎవరా అంటే.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే ఇలాంటి పుకార్లు మామూలే అనుకోవచ్చు. కానీ.. సల్మాన్, పూజా లవ్ లో ఉన్నారనే వార్తలు ఏకంగా వారి సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి అనేది గమనించాల్సిన పాయింట్. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.. తన పోస్ట్ రాసుకొచ్చాడు. పూజా హెగ్డే మొన్నటివరకూ సౌత్ స్టార్స్ తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. 2020 వరకు వరుస హిట్స్ అందుకున్న ఈ భామ.. 2022లో వరుస ప్లాప్స్ ని చవిచూసింది. దీంతో బాలీవుడ్ లో సినిమాలు సైన్ చేస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ తో ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’.. రణవీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉమైర్ సంధు తన తో రచ్చ లేపాడు. “సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రేమలోపడ్డారు. అందుకే సల్మాన్ తన తదుపరి రెండు సినిమాలకు కూడా పూజనే హీరోయిన్ గా తీసుకున్నాడట. అంతేగాక వీరిద్దరూ ప్రెజెంట్ ఖాళీ దొరికితే చాలు.. టైమ్ స్పెండ్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ సల్మాన్ సన్నిహితులే చెబుతున్నారు” అని తన లో రాసుకొచ్చాడు ఉమైర్. ప్రస్తుతం ఉమైర్ సంధు  వైరల్ గా మారింది. దీంతో అటు పూజా ఫ్యాన్స్ లో.. ఇటు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. మరి ఇవి కేవలం పుకార్లా లేక నిజమేనా అనేది ఈ జంటే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: