రేవంత్ కు షాక్ ఇస్తున్న ఇనయా..విన్నర్ ఎవరంటే?

Satvika
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రాను రాను టఫ్గా మారుతుంది.. ఎంతో మంది బయటకు వచ్చిన తర్వాత చివరి వారానికి చేరింది..ఈ సీజన్ గతంలో సీజన్ల కన్నా వరస్ట్ గా ఉన్నా కూడా విన్నర్ ను అనౌన్స్ చెయ్యక తప్పదు.హౌస్ లో ఉన్నవారిలో శ్రీహాన్ ఫైనల్ కు చేరుకున్నాడు. దాంతో మిగిలినవారంతా నామినేషన్స్ లో ఉన్నారు. దాంతో చివరి వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ మాత్రం ఓటింగ్ లో ముందు ఉన్నాడని తెలుస్తోంది. అయితే రేవంత్ కు పోటీగా ఇనాయ కూడా ఓటింగ్ లో దూసుకుపోతోందని తెలుస్తోంది.

ఇనాయ ఈ మధ్య కాలంలో గేమ్ బాగా ఆడుతోంది. చాలా వరకు ఆమె ఒంటరి పోరాటం చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా రాణిస్తోంది ఇనాయ. ఊహించని విధంగా ఇనాయకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.ఆమెను టాప్ 5లో ఉంచాలని కుదిరితే విన్నర్ గా నిలబెట్టాలని ప్రేక్షకులు చూస్తున్నారు. అసలైతే చివరి వారం ఆమె నామినేషన్స్ లో లేదు. దాంతో ఇనాయకు ఓటింగ్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కు ఓటింగ్ మాత్రం జోరుగా జరుగుతుందని టాక్.

ఇక హౌస్ నుంచి ఫైమా వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఒకొక్కరిని తమ స్థానాలు ఎంచుకోమని బిగ్ బాస్ ఏడూ నెంబర్స్ ఉన్న పోల్స్ ను ఉంచాడు. అయితే దీనిలో 1. రేవంత్, 2. ఇనయ సుల్తానా, 3. కీర్తి, 4. శ్రీసత్య, 5. శ్రీహాన్, 6. ఆదిరెడ్డి, 7. రోహిత్ నిలబడ్డారు. అయితే ఇదిహౌస్ లో ఉన్న వారు. తమకు తాము ఎంచుకున్న స్థానాలు. కానీ ఆడియన్స్ ఎవరికీ ఎక్కువ ఓటింగ్ ఇస్తారన్నది చూడాలి.ప్రేక్షకులు ఇస్తున్న ఓటింగ్ లో రేవంత్, ఇనాయ కు మధ్య గట్టి పోటీ జరుగుతుందని తెలుస్తోంది. ఇద్దరికీ కేవలం 2 శాతం మాత్రమే ఓటింగ్ లో తేడా ఉందని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఈ ఇద్దరు సేఫ్ అవుతారు. కానీ ఇనాయ కు వస్తున్న ఓటింగ్ చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: