సినిమాలు ప్లాప్ అవ్వడంతో సూసైడ్ కి పాల్పడ్డ స్టార్ హీరోయిన్..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు . హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు . ఎన్నో అవమానాలను ఎదుర్కొని సినీ ఇండస్ట్రీ కి రావాలని అనుకుంటూ ఉంటారు .ఇక అలా  ఎన్నో అవమానాలను ఎదుర్కొని సినీ ఇండస్ట్రీ కి   ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే .ఇండస్ట్రీకి 040 అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషి ఖుషి గా, మాయ, మోసగాళ్లకు మోసగాడు, శివరంజని వంటి సినిమాలలో నటించింది. ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ ఈమెకి సరైన గుర్తింపు అందలేదు. అనంతరం తమిళ్ ,

మలయాళం, హిందీ వంటి సినిమాలలో నటించినప్పటికీ గుర్తింపు సంపాదించుకోలేకపోయింది .ఇక చేసేదేమీ లేక వచ్చిన అవకాశాలను వదులుకోలేక బిగ్ సాలే ,గాలి వాన వంటి సినిమాల ద్వారా మళ్లీ ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని సినీ ఇండస్ట్రీ కి   ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్ ఒక ఇంటర్వ్యూలో ఆమె కెరియర్ గురించి మాట్లాడుతూ ...మొదట్లో ఎన్నో సినిమాల్లో నటించాను అవి పెద్దగా సక్సెస్ కాలేదు దాంతో చాలా బాధపడ్డాను... దీనికిగాను నేను సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నాను... ఒకదానివెంట మరొకటి ఫ్లాప్ సినిమాలు వెంటాడుతూ ఉండడంతో ఏం చేయాలో తోచక

 చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో ఇంటి మీద నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. చివరికి కౌన్సెలింగ్ తీసుకోవడంతో ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చానని తెలియజేసింది. ఇక ఎన్నో అవమానాలను ఎదుర్కొని సినీ ఇండస్ట్రీ కి  ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్ చేసిన ఈ వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ వార్త తెలిసిన కొందరు నెటిజన్లు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం... చిన్నచిన్న వాటికి అంత పెద్ద నిర్ణరయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: