ఆ విషయంలో సాటిస్ఫై చెయ్యలేను: శృతి హాసన్

Purushottham Vinay
తమిళ సీనియర్ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రుతిహాసన్. ఇక అనగనగ ఒక ధీరుడు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రుతిహాసన్. ఈ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రాంతో అయితే ఏకంగా పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా స్టార్ హీరోల సరసన మూవీలు చేసింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా మూవీలు చేసి ఆకట్టుకుంది. అడపాదడపా హిందీలోనూ మూవీలు చేసి ఎంతగానో మెప్పించింది శ్రుతిహాసన్. ఇక ఆ మధ్య మూవీస్ కి చిన్న గ్యాప్ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఆ తర్వాత క్రాక్ చిత్రంతో మళ్ళీ అదిరిపోయే హిట్ అందుకుంది.రవితేజ నటించిన ఈ చిత్రంతో శృతి హాసన్ సూపర్ మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్  చిత్రంలో కూడా శృతి చిన్న పాత్రలో కనిపించింది.ఇక ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా మారింది.

ఇక ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. శ్రుతి హాసన్ ఇప్పటికే ఒకసారి ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కూడా పెళ్లిదాకా వెళ్ళలేదు. ఇక ఇప్పుడు కొత్త బోయ్ ప్రెండ్ తో టైం శృతి బాగా స్పెండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా కొత్త బోయ్ ప్రెండ్ తో కలిసి ఫోటోలు పెడుతోంది.ఇక ఇదిలా ఉంటే మీకు మీ జీవితంలో కష్టమైనది ఏది.? అన్న ప్రశ్నకు శృతి స్పందిస్తూ.. అందరికీ నచ్చేలా బట్టలు వేసుకోవడం..మాట్లాడటం ఇంకా ప్రవర్తించడం వంటివి నాకు జీవితంలో అత్యంత కష్టమైన పనులు అని తెలిపింది శ్రుతిహాసన్. ఎందుకంటే ఇతరులు మనల్ని చూసే విధానం ఎప్పటికప్పుడు కూడా ఈజీగా మారుతూ ఉంటుంది.అందరిని అన్నివేళలా తృప్తి పరిచేలా ఉండటం అసలు నావల్ల కాదు.. మన మనసుకు నచ్చినట్లు బ్రతికితే చాలా సంతోషంగా ఉంటామని అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: