ఇల్లు వదిలి వెళ్లిపోయిన నాగచైతన్య.. బాధలో అక్కినేని ఫ్యామిలీ..!?

Anilkumar
అక్కినేని నాగార్జున  నట వారసులుగా  సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. నాగార్జున తన తండ్రి బాటలో నడిచి ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగచైతన్య  ఈ మధ్యనే వచ్చిన థాంక్యూ సినిమా, అలాగే లాల్ సింగ్ చద్దా సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యాయో మనం చూసాం. ఈ విషయం పక్కన పెడితే తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.. అయితే నాగార్జునని ఓ యాంకర్ మీరు మీ లైఫ్ లో ఎక్కువగా బాధపడిన ఏదైనా సంఘటన ఉందా అని ప్రశ్నించారు.

ఇక  దానికి నాగార్జున మాట్లాడుతూ.. నేను నా జీవితంలో నాగచైతన్య విషయంలో కొన్నిసార్లు చాలా ఏడ్చాను. ఎందుకంటే   నా పెద్ద కొడుకు నాగచైతన్య చిన్నప్పుడు ఎక్కువగా దగ్గుపాటి రామానాయుడు గారి ఇంట్లోనే ఉండేవారు.అయితే కేవలం సెలవులు వచ్చిన టైంలో మాత్రమే నా దగ్గరికి వచ్చేవాడు.ఆ టైంలో మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. ఇక  మళ్లీ సెలవులు అయిపోగానే బట్టలు, తన వస్తువులు అన్నీ బ్యాగ్ లో సర్దుకొని మళ్లీ రామానాయుడు ఇంటికి వెళ్లేవాడు.  అలా వెళ్లే టైంలో నాకు చాలా బాధనిపించేది. కానీ నాగచైతన్య  మాత్రం ఎందుకు నాన్న నేను మళ్ళీ సెలవులకు ఇక్కడికే వస్తాను కదా అని చెప్పినా కూడా నేను చాలా బాధపడే వాడిని.

అలా నా కొడుకు నా ముందే అన్ని సర్దుకొని వెళ్లడం చూస్తే నాకు చాలా బాధనిపించేది. ఇక అలా నాగచైతన్య వెళ్లేటప్పుడు నేను చాలాసార్లు వెక్కివెక్కి ఏడ్చాను.ఇక నేను ఆ బాధని అస్సలు తట్టుకోలేక పోయాను.అలా వెళ్ళిపోతున్నప్పుడు నాగచైతన్య చూస్తే నాకు ఏదో బాధ అనిపించేది అంటూ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.  ఈ విషయంలో నాగార్జున ముందుగా దగ్గుపాటి రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మి  ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అమల ని ప్రేమించడం వల్ల లక్ష్మికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక దీంతో నాగార్జున లక్ష్మికి పుట్టిన కొడుకు నాగచైతన్య చిన్నప్పుడు ఎక్కువగా తల్లి దగ్గరే పెరిగాడు.అయితే  అందుకే నాగచైతన్య సెలవుల టైంలో నాగార్జున దగ్గరికి వెళ్లేవారట.ఇదిలా ఇక  ప్రస్తుతం నాగార్జున ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: