ఇలా చేస్తే.. శ్రీలీలా కెరియర్ అయిపోయినట్టే..!
మరికొంతమంది హీరోయిన్స్ ని చూడగానే వీళ్ళకి ఇండస్ట్రీలో కెరియర్ లైఫ్ స్పాన్ ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అని అనిపిస్తుంది..ఆ కుర్ర హీరోయిన్ శ్రీ లీల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాలి.
మనసు దోచుకున్న ఈమె అందంతోపాటు అద్భుతమైన అభినయం.. దానికి తోడు మైమరిపించే డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ క్రమంలోని ఈమెకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ఈమె కాల్ షీట్స్ కోసం ఎగబడుతున్నారు. రీసెంట్ గా ఈమెకు సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సెకండ్ హీరోయిన్ పాత్ర వచ్చిందట. కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. మరొకవైపు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన డీజే టిల్లు టు సినిమాలో కూడా అవకాశాన్ని వదులుకుంది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాదు స్టార్ హీరో సినిమా అయినా సరే కోటి రూపాయలు పారితోషికం ఇస్తేనే సినిమా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాను అంటూ తెగేసి చెబుతోంది. మొత్తానికి అయితే పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. అంతేకాదు ఈమెకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి ముందుకొస్తున్నారట. ఒకవేళ ఈమె మొండి పట్టుబట్టి పారితోషకం విషయంలో ఇలాగే డిమాండ్ చేసుకుంటూ పోతే ఇక కెరియర్ ముగిసినట్టే అంటూ మరొకవైపు వార్తలు వినిపిస్తున్నాయి.