ఓటిటిలో రాణించలేకపోతున్న కాంతార.. ఎందుకంటే?

Purushottham Vinay
కన్నడలో సెప్టెంబర్  నెల చివర్లో విడుదల అయిన 'కాంతార' సినిమా అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా విడుదల అవ్వడం జరిగింది. కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 'గీతా ఆర్ట్స్' సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇక ఆ తర్వాత ఏకంగా 6 వారాల వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎపిక్  బ్లాక్  బస్టర్  హిట్ అయ్యి దండయాత్ర చేస్తూనే వచ్చింది.మన తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు నిలబడలేకపోతుండగా.. ఈ డబ్బింగ్ సినిమా ఏకంగా 6 వారాల పాటు మంచి కలెక్షన్స్ రాబట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు.'కాంతార' సినిమాకి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.


ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.27.97 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు మొత్తం రూ.25.97 కోట్ల భారీ లాభాలను అందించింది.ఓవరాల్ గా ఈ సినిమా బయ్యర్లకు పదింతలు లాభాలను అందించి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. 'పుష్ప'(పుష్ప ది రైజ్) కలెక్షన్లను బ్రేక్ చేయడం జరిగింది.అయితే ఓటిటిలో విడుదల అయిన ఈ సినిమా అంత స్పందన రాబట్టలేకపోతుంది. అయితే దీనికి కారణం వరాహ రూపం పాటని పెట్టకపోవడం అని తెలుస్తుంది. అయితే ఈ పాటపై కేరళ ప్రభుత్వం బ్యాన్  ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: