ఓటీటీ కే పరిమితం అవుతున్న తాప్సీ..!!
ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది తాప్సీ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఝుమ్మంది నాదం సినిమాతో సినిమా రంగానికి పరిచయం అయితే అయ్యింది. అయితే ఈమూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. తాప్సీకి మాత్రం హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. వెంటనే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా ఛాన్స్ కూడా కొట్టేసింది తాప్సీ. మిస్టర్ పర్ఫెక్ట్ తో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తరువాత తాప్సీ కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అని అనుకున్నారు.. అయితే ఎంత హిట్ సినిమా అయినా మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ కావడంతో.. ఆ ప్రభావం కనిపించింది. సినిమా చాన్స్ లు అయితే వచ్చాయి కాని.. మిస్టర్ పర్‌ఫెక్ట్ తర్వాత ఈమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ఇక తెలుగు ఇండస్ట్రీపై కాస్త ఘాటు మాటలు మాట్టాడి తాప్సీ వెంటనే బాలీవుడ్‌కు మకాం అయితే మర్చేసింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రచ్చ రచ్చ చేసిన బ్యూటీ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. బీటౌన్ లో తాప్సీకి చాలా కాలం కలిసి వచ్చింది. నటించిన ప్రతీసినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించింది
అయితే గత కొద్ది కాలంగా తాప్సీకి కాలంకలిసి రావడంలేదు బాలీవుడ్ లో కూడా ఆమె పని అయిపోయిందంటున్నారట సినీ జనాలు. తాప్సీ కెరీర్ గాడి తప్పిందంటున్నారు. కరోనాకు ముందు వెలుగు వెలిగిపోయిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ. కరోనా తర్వాత చతికలపడింది.
ఈ మధ్య తాప్సీ నటించిన సినిమాలన్ని దాదాపు ఓటీటీ బాటనే పడుతున్నాయి. ఒకటీ రెండు సినిమాలు థియేటర్‌లో రిలీజైన అవి పెద్దగా వర్కవుట్ కాలేకపోయాయి. దాంతో ఈమె కెరీర్ కష్టాల్లో పడిందని బీ-టౌన్‌లో కూడా డిస్కషన్స్ మొదలయ్యాయి.ఈమె నటించిన హసీన్ దిల్రూబా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రియుల నుండి విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. దాంతో ఈమె నటించిన సినిమాలు వరుసగా ఓటీటీ బాట పట్టాయి.
ఆతరువాత తాప్సీ సినిమాలు పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్, శభాష్ మిథు లాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి. దాంతో తాప్సీకి ఓటీటీ కాస్త కలిసొస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బ్లర్ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈసినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.
ఈసినిమాలో నటించడంతో పాటు తాప్సీ నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఈ సినిమాను కూడా ఓటీటీ రిలీజ్ పైనే ఆధారపడినట్టు తెలుస్తోంది. తాప్సీకి ఓటీటీ కలిసి రావడంతో.. థియేటర్ వైపు వెళ్లకుండా బుల్లతెరనే నమ్ముకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.