పాపం వరలక్ష్మి.. స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఆయన వల్లే ఇలా..!?

Anilkumar
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇక సీనియర్ నటుడు శరత్ కుమార్‌ కుమార్తె అయిన వరలక్ష్మి.. 2012లో `పోదా పొడి` అనే అని తమిళ చిత్రంతో సినీ కెరీర్ నుప్రారంభించింది.అయితే హీరోయిన్ గానే మొదట సినిమాలు చేసినా.. క్రమక్రమంగా విలన్ పాత్రలు, సహాయక పాత్రలతో సెటిల్ అయింది.ఇక `తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్` అనే సినిమాతో విలన్ గా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ తర్వాత `క్రాక్‌` సినిమాతో జయమ్మగా సూపర్ పాపులర్ అయిన ఈ అమ్మడు.. `నాంది`లో డీసెంట్ పాత్రను పోషించి మెప్పించింది.

ఇదిలావుంటే  ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డజన్ కు పైగా చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు అలాగే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సైన్ చేసింది. రీసెంట్ గా ఈమె సమంత టైటిల్ పాత్రలో తెరకెక్కిన `యశోద` సినిమాలో కీలక పాత్రను పోషించింది.అయితే హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక వరలక్ష్మి పాత్రకు సైతం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక నిజానికి వరలక్ష్మి స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పాల్సిందట.

కానీ ఇక  ఆమె తండ్రి శరత్ కుమార్ కారణంగా సహాయక పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది.  2003లో శంకర్ రూపొందించిన `బాయ్స్` చిత్రంలో వరలక్ష్మిని మొదట హీరోయిన్ గా ఎంపిక చేశారు.అంతేకాదు అలాగే ప్రేమిస్తే సినిమాలో సైతం హీరోయిన్ గా వరలక్ష్మినే అనుకున్నారట. కానీ, శరత్ కుమార్ కు వరలక్ష్మి సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదట. ఇక దాంతో వరలక్ష్మి వచ్చిన మంచి అవకాశాలను చేతులారా వదులుకుంది. అయితే ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇకపోతే ఒకవేళ ఆ రెండు సినిమాలు నటించి ఉంటే వరలక్ష్మి స్టార్ హీరోయిన్ అయ్యుండేదని ఆ తర్వాత చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇక  తన తండ్రి కారణంగా బాయ్స్, ప్రేమిస్తే వంటి సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని వరలక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.ఇక  ప్రస్తుతం సినిమా మాత్రమే తన ప్రపంచమని, స్టార్ హీరోయిన్ అనే ముద్ర కంటే గొప్ప నటి అని పిలిపించుకోవడమే తనకు ఇష్టపడతానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: