టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసత్వపు హీరోలు రోజురోజుకు పెరిగిపో తున్నారు. అయితే ఎవరికి టాలెంట్ ఉంటే వారు మాత్రమే సినిమా పరిశ్రమంలో నిలదొక్కుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అన్నల బాటలో కొంత మంది తమ్ముళ్లు నడిచి అన్నను మించిన స్టార్స్ అయ్యారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి తో సినిమా పరిశ్రమ లోకి వచ్చి ఇప్పుడు ఎంతటి స్థాయి హీరో గా ఎదిగారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇప్పుడు పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్.
ఇప్పుడు ఆయనకు అన్నను మించిన క్రేజ్ ఉంది అంటే ఏ విధంగానూ సందేహ పడనవ సరం లేదు. ఈ విష యాన్ని చిరం జీవి సైతం ఒప్పుకుంటాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. అలాగే హరిహర వీరమల్లు అనే సినిమా లో కూడా నటిస్తున్నారు. ఇక హీరోగా, అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య ఆయన తర్వాత బాటలోనే తమ్ముడు కార్తీ కూడా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం అయ్యాడు. సహజంగా నటించే నటుడిగా కా ర్తీకి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి మార్కెట్ను ఏర్పరచుకున్నాడు.
సూర్య కి తగ్గ అభిమానులు ఆయనకు ఉన్నారు. అలాగే ఆయనకు అన్నను మించిన ఫాలోయింగ్ సైతం అందుకున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఇకపోతే కన్నడలో హీరోగా అగ్ర స్థానాన్ని పొందిన శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కూడా అగ్ర హీరోగా ఎదిగాడు. అక్కడ ఆయన్ని పవర్ స్టార్ అంటారు. ఇటీవలే పరమపదించిన ఆయన అన్నను మించిన స్థాయిలో క్రేజ్ సంపాదించుకొని హీరోగా కొనసాగాడు. ఆయన చనిపోయాక వస్తున్న కొన్ని సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకోవడం ఆయన క్రేజ్ కు నిదర్శనం.