పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక RC15 వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం శంకర్ ఈ మూవీతో పాటు కమల్ హాసన్ తో " భారతీయుడు 2 " కూడా ఏక కాలంలో తెరకెక్కిస్తున్నాడు. శంకర్ రోబో మూవీ తరువాత చేసిన మూవీస్ ఏవి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఆ తరువాత వచ్చిన " ఐ " , రోబో 2.0 " వంటి సినిమాలు ఆయన బ్రాండ్ వల్ల జస్ట్ హిట్ గా నిలిచాయి తప్పా.. శంకర్ రేంజ్ హిట్ కాదనే చెప్పాలి.
ఇక దాంతో రాంచరణ్ మూవీ తోనైనా ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు.ఇకపోతే గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు భారీ చిత్రాలకు ఏక కాలంలో దర్శకత్వం వహిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే ఇక రామ్ చరణ్, కమల్ హాసన్ మూవీస్ తర్వాత బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ తో శంకర్ ఓ మూవీ చేయనున్నాడు.కాగా మొదట రణ్ వీర్ తో అపరిచితుడు రీమేక్ చేయాలని భావించినప్పటికి ప్రస్తుతం స్ట్రైట్ మూవీ వైపే ముగ్గు చూపుతున్నారట శంకర్.ఇక " వెల్పరి " అనే తమిళ్ నవల ఆధారంగా రణ్ వీర్ మూవీని
రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీని దాదాపుగా వెయ్యి బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించే అవకాశం ఉందట. అంతే కాకుండా ఇక కథ పరంగా ఇంకో ముగ్గురు హీరోలకు కూడా ఛాన్స్ ఉందట. ఇకపోతే తమిళ్ లో సూర్య, తెలుగులో రాంచరణ్, కన్నడలో యష్, బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్, ఇలా ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఈ ప్రాజెక్ట్ ను శంకర్ తెరకెక్కించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది..!!