సింపతీ వేవ్ ను నమ్ముకున్న సమంత !
ఒకొక్క సినిమాకు ఒకొక్క పబ్లిసిటీ వ్యూహం కలిసి వస్తుంది. ఒక సినిమా విడుదల అయ్యే ముందు ఆసినిమా పై విపరీతమైన వివాదాలు చుట్టుముడితే ఆమూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ బాగా వస్తాయి. మరికొన్ని సినిమాల ప్రమోషన్ లో ఆసినిమాల దర్శకులు హీరోలు చేసిన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆసినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి.
ఇప్పుడు ఈవారం విడుదల కాబోతున్న సమంత ‘యశోద’ సినిమాకు సింపతీ వేవ్ కలిసి వస్తుందా అన్న అంచనాలు బాగా వస్తున్నాయి. ఆమధ్య కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తరువాత విడుదలైన అతడి ఆఖరి సినిమాకు సింపతీ వేవ్ తో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో విపరేథమైన కలక్షన్స్ వచ్చాయి.
చాల సంవత్సరాల క్రితం విడుదలైన అక్కినేని ఫ్యామిలీ ‘మనం’ సినిమాను కూడ సింపతీ వేవ్ తో బాగా చూశారు. ఇప్పుడు సమంత అనారోగ్యం ఓపెన్ సీక్రెట్ కావడంతో ఆమె పై ఏర్పడిన సింపతీ వేవ్ ‘యశోద’ మూవీకి భారీ కలక్షన్స్ ను తెచ్చి పెడుతుందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తీయబడ్డ ఈమూవీని ప్రమోట్ చేసే పరిస్థితి ప్రస్తుతం సమంత కు లేదు. అందువల్లనే తన అనారోగ్య సమస్యను బయటపెట్టి ఈసినిమా ప్రమోషన్ కు తాను రాలేను అన్న సంకేతాలు సమంత ఇచ్చింది అనుకోవాలి.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్ అలాగే సౌండ్ డిజైన్ చాలా బాగుండటంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వస్తున్నాయి. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సమంత ఈమూవీని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న మయోసైటిస్ వ్యాధి నుండి ఆమె కోలుకోవాలని సెలెబ్రెటీల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరు కోరుకున్న పరిస్థితులలో ఈవారం విడుదల అవుతున్న ‘యశోద’ విజయం ఆమె కెరియర్ కు అత్యంత కీలకం అవుతుంది..