యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో అదుర్స్ మూవీ ఒకటి. అదుర్స్ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ చారి అనే పాత్రలో అద్భుతమైన కామెడీ ని పండించి , ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు.
అలాగే ఇంకో పాత్రలో మాస్ లుక్ లో కనిపించి కూడా ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. ఈ మూవీ లో నయన తార షీలా హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటించాడు. బ్రహ్మానందం కూడా ఈ మూవీ లో తన కామెడీ తో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. అదుర్స్ మూవీ 13 జనవరి 2010 వ సంవత్సరం విడుదల అయ్యింది. అదుర్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి , మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు వి వి వినాయక్ లు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ కి వల్లభనేని వంశీ మోహన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అదుర్స్ మూవీ ని మరి కొన్ని రోజుల్లో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.