మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అంజలి , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ జే సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతంగా , రిచ్ గా తెరకెక్కిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఇప్పటికే కొన్ని ఫోటోలు మరియు వీడియోలు లీక్ కాగా అందులో రామ్ చరణ్ లుక్ అద్భుతంగా ఉండడంతో , ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ లపై న్యూజిలాండ్ లో ఒక అదిరిపోయే సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు , ఈ సాంగ్ కోసం ఏకంగా 9 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది.