హన్సిక భర్త ఇతడే.. పెళ్లి ప్రపోజ్ ఎలా చేశారంటే..?

Divya
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే త్వరలోనే హన్సిక వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హన్సిక చిన్ననాటి స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె ప్రేమలో ఉన్నదని త్వరలోనే తనని వివాహం చేసుకోబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోని హన్సిక పెళ్లికి సంబంధించి నిత్యం ఎక్కడో ఒకచోట వార్తలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇకపోతే హన్సిక స్నేహితుడు ప్రియుడు సోహైల్ కతూరియానే ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం పారిస్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా సమాచారం తాజాగా హన్సిక సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు తనకు ప్రపోజ్ చేసుకున్నటువంటి ఫోటోలను సైతం తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్యారిస్ ఈఫిల్ టవర్ సాక్షిగా హన్సిక కు సోహైల్ కతూరియానే ప్రపోజ్ చేయడంలో హన్సిక చాలా సంబర పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా ఈఫిల్ టవర్ ముందు చుట్టూ క్యాండిల్స్ వెలిగించి మధ్యలో మోకాళ్ళపై కూర్చొని హన్సిక మ్యారి మీ అంటూ సోహెల్ ప్రపోజ్ చేయడం చాలా హైలెట్ గా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ మొదటి వారంలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి పెళ్లి తేదీ కూడా త్వరలోనే అధికారికంగా వెళ్ళండించబోతున్నట్లు సమాచారం. హన్సిక వివాహం మాత్రం జైపూర్ లో ఒక పురాతన ప్యాలెస్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి పలు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఎట్టకేలకు హన్సిక పెళ్లితో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: