టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు శిరీష్ తన కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించింది. శ్రీరస్తు శుభమస్తు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అల్లు శిరీష్ ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించినప్పటికీ , శ్రీరస్తు శుభమస్తు మూవీ రేంజ్ విజయాన్ని మాత్రం ఈ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యూయల్ హీరోయిన్ గా నటించగా , రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథి గా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే "ఊర్వశివో రాక్షసివో" మూవీ తో అల్లు శిరీష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.