ఈసారి సంక్రాంతి కి కొంత మంది స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తలకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రవితేజ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూఎస్ఏ హక్కులను శ్లోక సంస్థ 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూఎస్ఏ హక్కులను శ్లోకా సంస్థ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన దళపతి విజయ్ ప్రస్తుతం వరీసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల కాబోతుంది. తమిళ్ లో ఈ మూవీ వరసు పేరుతో విడుదల కానుండగా , తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ హక్కులను శ్లోకా సంస్థ 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
ఇలా ఈ మూడు సినిమాల యూఎస్ఏ హక్కులను శ్లోకా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.