నటుడు రిషబ్ శెట్టి ని సన్మానించిన రజనీకాంత్..!!
ఇక ఆటు తర్వాత ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కూడా కురిపించారు. ఈ మేరకు రజనీకాంత్ ఆహ్వానం మేరకు నిన్నటి రోజున ఆయన నివాసానికి వెళ్లి రిషబ్ ను సన్మానించడం జరిగింది. రజనీకాంత్ కాంతార చిత్రం తనకి ఎంతో బాగా నచ్చిందని తెలియజేశారు. రిషబ్ కు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం వీరిద్దరూ ఈ చిత్రం గురించి పలు విశేషాలను సైతం ముచ్చటించారు. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సూపర్ స్టార్ కు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
మీరు మమ్మల్ని ఒక్కసారి మెచ్చుకుంటే మాకు 100 సార్లు అనిపిస్తుందని.. ధన్యవాదాలు రజిని సార్ మా చిత్రం అభినందించడం మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సినిమా కర్ణాటక కేరళ సరిహద్దులో ఉండే ఆదివాసుల సాంప్రదాయ భూతకోల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రాన్ని హుంబలే ఫిలిం బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్గా సప్తమి గౌడ, కిషోర్ ,అచ్యుత్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.