కళ్యాణ్ రామ్ కోసం అదిరిపోయే ప్లాన్ వేసిన మైత్రి మేకర్స్..!?

Anilkumar
ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో హిట్ కొట్టి ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చారు.ఇక ప్రస్తుతం ఆయన పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే కళ్యాణ్ రామ్ రెండు సినిమాల లైన్లో పెట్టారు. ఇక అందులో ఒకటి ఆయన 19వ సినిమా కాగా మరొకటి 20వ సినిమా. ఇదిలావుంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ 19వ సినిమా షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగాయి. 

 కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి అమిగోస్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇక అమిగోస్ అనేది ఒక స్పానిష్ పదం, స్నేహితుడిని ఉద్దేశించి మాట్లాడేందుకు ఈ పదాన్ని స్పానిష్ లో వాడుతూ ఉంటారు.అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పాటు దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

 అంతేకాదు ఈ ఏడాది బింబిసార సినిమాతో ఆయన హిట్ అందుకోవడంతో కళ్యాణ్ రామ్ మార్కెట్ కాస్త పెరిగింది. ఇక దీంతో డిసెంబర్ రెండో తేదీన సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.ఇక ఈ నేపద్యంలో బాబాయ్ సెంటిమెంట్ డేట్ ని అబ్బాయి కూడా ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ అమిగోస్ సినిమాకి రాజేంద్ర డైరెక్షన్ చేయగా మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మించింది.కాగా  ఈ సినిమా కాకుండా కళ్యాణ్ రామ్ డెవిల్ అనే మరో సినిమా చేస్తున్నాడు.  అయితే బ్రిటిష్ కాలం నాటి ఒక కథ నేపథ్యంలో నవీన్ మేడారం ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే  ఈ అమిగోస్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: