ఎన్టీఆర్ శక్తి సినిమా గురించి.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తీవ్రస్థాయిలో నిరాశపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే శక్తి సినిమా డిజాస్టర్ విషయంలో ఆ సినిమా దర్శకుడు మహర్ రమేష్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. తాను ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని ప్లాన్ చేసుకున్న సమయంలో మరోరకంగా ప్లాన్ చేసుకున్నాను అంటూ మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు కానీ కొందరు పెద్దలు సినిమా కథలో డివోషనల్ టచ్ ఇవ్వమని కోరారు. ఇక చేసేదేమీ లేక నేను కూడా కథను మార్పు చేసి సినిమా తీసాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు మెహర్ రమేష్.
ఏకంగా ఎన్టీఆర్ తో ఓన్లీ యాక్షన్ డ్రామా మాత్రమే ప్లాన్ చేసుకున్నాడట మెహర్ రమేష్. కానీ నిర్మాత సూచనతో ఇక శక్తి పీఠాలు లాంటి డివోషనల్ టచ్ యాడ్ చేయాల్సి వచ్చిందట. తాను రాసుకున్న కాన్సెప్ట్ అది కాదని ఇక శక్తి సినిమా ఫ్లాప్ కావడంలో తన భాగం ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కథపై ఎన్ని నిజాలు బయటపెట్టిన ఆల్రెడీ డిజాస్టర్ ఆయన సినిమా ఫలితాన్ని అయితే మార్చలేరు.. కానీ శక్తి సినిమాకు సంబంధించిన అసలు విషయం మాత్రం అందరికీ తెలిసి వచ్చింది అంటూ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారట.