'ఓరి దేవుడో' సినిమా కోసం.. వెంకీ ఎంత తీసుకున్నాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్న హీరోల సినిమాల్లో కూడా అప్పటికే సూపర్ హిట్లు అందుకొని దశాబ్దాల ప్రస్తానాన్ని కొనసాగించిన స్టార్ హీరోలు నటిస్తూ ఉండడం గమనార్హం. చిన్న పాత్రలు అయినా సరే నటించేందుకు ఎక్కడ వెనకాడటం లేదు. ఇలా గెస్ట్ రోల్ లో నటిస్తూ యువహీరోలకు బాగా ప్రోత్సాహం అందిస్తున్న హీరోలలో వెంకటేష్ ముందు వరుసలో ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లో గెస్ట్ రోల్ చేసిన వెంకటేష్ ఇక ఇప్పుడు యువ హీరో విశ్వక్సేన్ హీరోగా,మిథిలా పార్కర్ జంటగా నటించిన ఓరి దేవుడా సినిమాలో కూడా మరోసారి ఇలాంటిదే చేశాడు.


 ఇటీవలే అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. ఇక మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా.  ఈ సినిమాలో టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేసి మెప్పించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ వెంకి పాత్ర కథ మొత్తాన్ని మలుపు తిప్పుతుంది అని చెప్పాలి.


 సాధారణంగా చిన్న హీరోల సినిమాలు అంటే స్మాల్ బడ్జెట్ ఉంటుంది.. కానీ స్టార్ హీరోలు నటించాలి అంటే పారి పారితోషకం చెల్లించాలి. దీంతో వెంకటేష్ కి పారితోషికం ఎంత ఇచ్చారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ 5 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారట. ఇందుకు గాను వెంకీ మామ మూడు కోట్ల పారితోషకం తీసుకున్నారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.  కేవలం ఐదు రోజుల షూటింగ్ కోసం మూడు కోట్ల పారితోషకమా వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: