చిరు 'వాల్తేరు వీరయ్య'ను.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్నారు?

praveen
ఇండస్ట్రీలో స్వయం శక్తితో ఎదిగి దాదాపు మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక ఇప్పుడు 60 ఏళ్లు దాటి పోతున్న కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా నటనలో, డాన్సుల్లో అదే గ్రేస్ చూపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న గాడ్ ఫాదర్ అనే తమిళ సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు.

 చిరంజీవి కెరీర్లో  బ్లాక్ బస్టర్ అయినా సినిమాలలో గాడ్ ఫాదర్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఇప్పుడు యువ డైరెక్టర్ బాబి టేకింగ్ లో ఒక సినిమా చేస్తున్నారు మెగాస్టార్.  ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం మెగా అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు అని చెప్పాలి. ఇకపోతే అభిమానులందరూ కోరుకున్నట్లుగానే ఇక ఇటీవల దీపావళి సందర్భంగా మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న  సినిమాకు వాల్తేరు వీరయ్య అనే అఫీషియల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.. ఈ టీజర్ మొదలవ్వగానే ఒక డెన్ లో హీరోని ఎగతాళి చేస్తూ విలన్ మాట్లాడుతూ ఉంటాడు.

 ఈ సమయంలోనే ఇక మాస్ ఎంట్రీ ఇస్తాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఎంట్రీ తోనే విధ్వంసం సృష్టిస్తాడు అని చెప్పాలి. ఇక చిరంజీవి వీరయ్య పాత్రలో లుంగీకట్టుకొని బీడీ తాగుతూ చెవిపోగు మెడలో వేసుకొని బంగారు గొలుసులు వేసుకొని ఊర మాస్ లుక్ లో కనిపించాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఎంటర్టైనిక్ ధమాకా ఇంకా చూడాలంటే లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అంటూ తనదైన శైలిలో డైలాగ్ కూడా చెబుతాడు. అయితే చిరంజీవి లుక్ పై మిశ్రమ స్పందన వస్తుంది. ఎప్పటిలాగానే మెగా ఫాన్స్ ఆహా ఓహో అంటూ పొగడ్తలతో ముంచేస్తూ ఉంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం  సో సో ఉంది అని అంటున్నారు.. కొంతమంది అయితే వాల్తేరు వీరయ్య రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంటున్నారు. చిరంజీవి ఫ్లాప్ మూవీ అందరివాడుతో వాల్తేరు వీరయ్య సినిమాను కూడా పోల్చి చూస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: