బిల్లా సినిమా పై ఊహించని కామెంట్స్ చేసిన డైరెక్టర్..!!
ఇక అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ హీరో, హీరోయిన్స్ కాంబినేషన్లో కలిస్తే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది.అయితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు. కాగా కొంతమంది ఇలా కలిసి రాక మరి కొంతమందికి మాత్రమే నిరాశను మాత్రమే మిగులుస్తూ ఉంటుంది. ఇలాంటి దర్శకుడు లిస్టులలో మొదటి వరుసలో ఉండేది మాత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ అని చెప్పవచ్చు. రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు డైరెక్టర్ మెహర్ రమేష్.
బిల్లా కథ కంటే కూడా పవర్ఫుల్ స్టోరీ తన వద్ద ఉందని తెలియజేశారు అయితే ప్రభాస్ కోరిక మేరకు జిల్లాలో అతడిని చాలా స్టైలిష్ గా చూపించమన్నారు ప్రభాస్ ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని ఉద్దేశంతోనే ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా తెరకెక్కించానని తెలిపారు. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే కల్ట్ క్లాసికల్ గా మిగిలిందని తెలియజేశారు. ఇకపోతే మెహర్ రమేష్ స్టార్ హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ గానే మిగిలాయి. ముఖ్యంగా కంత్రి, షాడో ,శక్తి తదితర చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.