NBK107: ఫర్ ది ఫస్ట్ టైం అక్కడ అదిరే అప్డేట్?

Purushottham Vinay
ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న NBK 107 మూవీకి సంబంధించిన టైటిల్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా బ్లాస్టింగ్ అప్ డేట్ ని అందించబోతున్నామంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీజర్ తో ఇప్పటికే భారీ అంచనాల్ని రేకెత్తిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బ్లాక్ షర్ట్ గల్ల లుంగీతో కనిపించిన తీరు అభిమానుల్లో మాస్ యుఫోరియాని క్రియేట్ చేసింవది. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా మరింత పవర్ ఫుల్ గా వుండనుందనే సంకేతాల్ని మేకర్స్ అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ని అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు కొండారెడ్డి బురుజు సాక్షిగా బ్లాస్టింగ్ అప్ డేట్ తో టైటిల్ ని ప్రకటించబోతున్నారు.



టైటిల్ రిలీజ్ కోసం 21న కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర భారీ ఈవెంట్ ని నిర్వహించి టైటిల్ ని ప్రకటించబోతున్నారు. ఇలా ఓ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కావండంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీలక పాత్రల్లో కన్నడ స్టార్ దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ మలయాళ నటి హనీ రోజ్ చంద్రిక రవి లాల్ నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఆ టైటిల్ బాలయ్య అభిమానుల్ని ఏ మేరకు సర్ ప్రైజ్ చేయనుందన్నది తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయలో నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: