ఓటీటి లో రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్వాతిముత్యం..!!

Divya
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన మొదటి చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరించింది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోయింది. ఇందులో గణేష్ కు జోడీ గా వర్ష భోల్లమ్మ నటించగా డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇక థియేటర్లలో సక్సెస్ అయిన ఈ చిత్రం తాజగా డిజిటల్ స్ట్రిమ్మింగ్ కు సిద్ధమయ్యింది.

ఎప్పుడు సూపర్ హిట్ చిత్రాలతో పాటు పలు గేమ్ షోలను, టాక్ షోలను అందిస్తున్న ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన ఆహా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకోని విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహార స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు మేకర్ ప్రకటించడం జరిగింది. స్వాతిముత్యం లాంటి ఒక యువకుడి కథ చిత్రం ఆధారంగా ఈ సినిమాని. జీవితం ప్రేమ పెళ్లి పట్ల ఆలోచనలు అభిప్రాయాలు నడుము సాగే ఒక జీవిత ప్రయాణం ఎలా ఉంటుందో  ఈ సినిమాలు చూపించడం జరిగింది. ఈ సినిమా కుటుంబ సంబంధాలు బాగోద్వేగాలు కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు డైరెక్టర్ లక్ష్మణ్.

ప్రస్తుతం బెల్లంకొండ గణేష్ కూడా తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రమే నేను స్టూడెంట్ సార్ అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం స్వాతిముత్యం సినిమాకు సంబంధించి ఈ ట్వీట్  కాస్త వైరల్ గా మారుతోంది. మరి వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఓటీటి లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: