ప్రస్తుతం అఖిల్ అక్కినేని స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ కోసం నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ గా పేరు పొందిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చెయ్యగా ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఏజెంట్ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుంది. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ,మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు జరుపుతున్నారు. నిజానికి ఈ చిత్రం అగస్టు 12నే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయింది.‘ఏజెంట్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘చిరు154’ పోస్ట్ ప్రొడక్షన్‌లకు ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుందట. ఈ క్రమంలోనే సినిమా విడుదల ఆలస్యమయ్యేలా ఉందని సమాచారం. దాంతో సంక్రాంతి బరిలో ‘ఏజెంట్’ సినిమాను లైన్లోకి తీసుకురావాలని అనీల్ సుంకర్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా సంక్రాంతికి ఇప్పటికే ‘ఆదిపురుష్’, ‘వారసుడు’ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు బాలయ్య కూడా సంక్రాంతికే రానున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంత పెద్ద స్టార్ హీరోలతో అఖిల్ పోటీగా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏజెంట్ కంటెంట్ ఒక రేంజిలో వుండే ఉంటుంది. ‘అఖిల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు మొదటి సినిమానే తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో’ ప్రేక్షకుల ప్రశంసలు పొందిన.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ‘మిస్టర్ మజ్ను’ సినిమా అయితే వారంలోపే దుకాణం సర్ధేసింది. ఆ సమయంలో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ భారీ విజయాన్ని అందించింది. గతేడాది దసరాకు రిలీజై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అఖిల్ అదే జోష్‌తో ‘ఏజెంట్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు.మరి చూడాలి ఏజెంట్ ఎంత బాగా ఆకట్టుకుంటుందో.