కీర్తి సురేష్ - సీతారామం హీరోయిన్ మధ్య కనెక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అంతేకాదు  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా తర్వాత తన గ్లామర్ డోస్ పెంచేసింది.అంతేకాదు థైస్ అందాలు చూపిస్తూ పిచ్చ లేపుతున్న కీర్తి సురేష్ అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించినా వాటితో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్.ఇకపోతే మృణాల్ ఠాకూర్ కూడా గుర్తింపులో తక్కువ ఏమీ కాదు.  

ఈమె గురించి తెలుసుకోవాలి అంటే సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన మృణాల్ .. లవ్ సోనియా అనే హిందీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.  తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్న మృణాల్ ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. అయితే యుద్ధం తో సాగే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యమిది.ఇక  హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ .. స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీ దత్ , స్వప్న దత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.కాగా  ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది .  ఒకవైపు ప్రిన్సెస్ నూర్జహాన్.. మరొకవైపు సీతామహాలక్ష్మి గా మృణాల్ తనదైన నటనతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ కు..

సీతామహాలక్ష్మిగా అలరించిన మృణాల్ ఠాగూర్ కు మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉందట.అదేమిటంటే సీతారామంలో సీతాలక్ష్మి గా మృణాల్ నటించడానికి ఒకరకంగా కీర్తి సురేష్ కారణమని చెప్పాలి అంటూ ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.అయితే  అసలు విషయంలోకి వెళ్తే.. మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ కు మహానటి సినిమా తరఫున డైరెక్టర్ నాగ్ అశ్విన్ వచ్చారు.ఇక  ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతం.. ఆమె నటన చూశాక అలాంటి అందమైన పాత్ర చేయాలని ఉందంటూ నాగ అశ్విన్ తో నా మనసులో మాటను బయటపెట్టాను. అయితే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్నాయన సీతారామం సినిమాలో నాకు అవకాశాన్ని కల్పించారు.ఇక  అలా సీతారామం ద్వారా వైజయంతి ఫిలిమ్స్ లో నేను భాగమయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే దీన్ని బట్టి చూస్తే పరోక్షంగా సీతారామంలో కీర్తిసురేష్ వల్లనే మృణాల్ అవకాశం దక్కించుకుంది.. మరొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే .. మహానటి, సీతారామం రెండు సినిమాలలో కూడా దుల్కర్ సల్మాన్ హీరో కావడం విశేషం.అంతేకాదు  అలాగే ఈ రెండు చిత్రాలు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే నిర్మితమయ్యాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: