దీపావళి విజేత పై ఎదురు చూపులు !

Seetha Sailaja

‘దసరా’ పండుగ విజేతగా ‘గాడ్ ఫాదర్’ నిలిచింది. ఈసినిమా పై కొందరు నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఆ నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకుని నిలబడగలిగింది. ఇక రానున్న ‘దీపావళి’ రేస్ పై ఇప్పుడు అంచనాలు ప్రారంభం అయ్యాయి. ఈసారి దీపావళి కి టాప్ హీరోల సినిమాలు ఏవీ విడుదల కాకపోయినప్పటికీ పోటీ మాత్రం చాల ఎక్కువగా ఉంది.




యూత్ లో క్రేజీ హీరోగా మంచి పేరు ఉన్నప్పటికీ ఈమధ్య వరస పరాజయాలు చూస్తున్న విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఇది తమిళ సినిమాకు రీమేక్ అని అందరికీ తెలిసిందే. ఇందులో వెంకటేష్ కూడ నటించడంతో ఈమూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి. కార్తీ నటించిన తమిళ్ డబ్ మూవీ సర్దార్ కూడా అదేరోజు విడుదల కాబోతోంది.


మంచు విష్ణు తన ‘జిన్నా’ పై కూడ చాల ఆశలు పెట్టుకోవడంతో ఈ దీపావళి రేసుకు రాబోతున్నాడు. ఈసినిమా కోసం విష్ణు సన్నీలియోన్ తో అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లతో ప్రమోషన్స్ బాగానే చేస్తున్నాడు. ఈసినిమా కూడ హిట్ అవ్వకపోతే విష్ణుకు మరిన్ని కష్టాలు తప్పేడట్లు లేదు. ఈ దసరా రేస్ లో రాబోతున్న అక్షయ్ కుమార్ ‘రామసేతు’ పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి.



ఈమధ్య కాలంలో శ్రీరాముడి గురించి ఏవార్త వచ్చినా అదేవిధంగా ఏకథనం వచ్చినా అది సంచలనంగా మారుతున్న పరిస్థితులలో ‘రామసేతు’ సూపర్ హిట్ అంటున్నారు. ఈ దీపావళి కి ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ సినిమా కూడా విడుదల కాబోతోంది. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈసినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో ఇన్ని చిన్న సినిమాలు ఇన్ని డబ్బింగ్ సినిమాల మధ్య ఏసినిమా దీపావళి విజేతగా మారుతుంది అన్న విషయమై రకరకాల అంచనాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: