ఇప్పుడు సోషల్ మీడియాలో కాంతార చిత్రం తెగ మారుమ్రోగింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ రెండుసార్లు చూశానంటూ చెప్పడంతో ఈ సినిమాపై ఎంతో భారీగా హైప్ ఏర్పడింది. ఆ ప్రభావం ఓపెనింగ్ డే స్పష్టంగా కనిపించింది. కాంతార చిత్రం థియేటర్స్ ప్రేక్షకులతో పోటెత్తాయి. ముఖ్యంగా అర్బన్, సెమి అర్బన్ ఏరియాల్లో అయితే హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిశాయి.కనీసం హీరో హీరోయిన్ దర్శకుడు ఎవరో కూడా తెలియకుండా సినిమా కోసం ప్రేక్షకులు క్యూ కట్టారు. కాగా కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం తెలుస్తుంది. మొదటిరోజే ఈ మూవీ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు.
ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలు నమోదుచేస్తుంది.థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించి హీరోగా నటించారు.ముఖ్యంగా ఈ కాంతార క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మామూలుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు "కాంతార" క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా ఒక సూపర్ స్టార్ సినిమా లాగా మారుమోగిస్తుంది.