కన్నడలో ఇటీవల విడుదలైన 'కాంతార' సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళుతోంది.చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు దేశం చూపు మొత్తం తనవైపు తిప్పుకుంటూ అన్ స్టాపబుల్ అంటూ దూసుకువెళుతుంది.కన్నడ స్టార్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత - దర్శకుడు కూడా ఆయనే. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు.కాంతార సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. రెండో సోమవారం కేజీఎఫ్ 2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భారీ వసూళ్లను రాబట్టిన కాంతార చిత్రం ఇతర భాషల్లో కూడా విజయవంతంగా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా కాంతార కలెక్షన్లపై హొంబలే సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. 16వ రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని పేర్కొంది. ఇండియాతో పాటు విదేశాల్లో 16వ రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పోస్ట్ చేసింది.ఈ సినిమా సాధించిన మరో ఘనత ఏంటంటే అమెరికాలో ఈ సినిమా కేవలం 40 లొకేషన్స్ లోనే 500k డాలర్ల పైగా వసూళ్లు సాధించింది. ఇది ఇండియాలో ఏ సినిమాకి లేనటువంటి రికార్డు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హీరో శివ పాత్రలో రిషబ్ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు దర్శకుడు రచయిత కూడా ఆయనే కావడం విశేషం.సినిమా ఓపెనింగ్ సీన్లో సప్తమి గౌడ హీరోయిన్గా నటించి రియల్ కార్పెట్ యాంగిల్స్‌ను రన్ చేస్తూ అద్భుతమైన సీన్ ఇచ్చింది. ఇక ఆమెకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.అచ్యుత్ కుమార్, మానసి సుధీర్, ప్రమోద్ శెట్టి సహా బెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా దాదాపు 16 కోట్లతో తీసినట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి ఈ సినిమా 114 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించి భారీ లాభాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రభాస్, కిచ్చా సుదీప్ , ధనుష్ సహా అగ్ర నటులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ .. కన్నడలో 'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్టు అని అర్థం. ప్రకృతికి .. మానవుడికి మధ్య జరిగే ఘర్షణ ఇది. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే, కర్ణాటకలో 'కంబళ' అనే క్రీడ ఉంది. కథలో ఆ నేపథ్యం కూడా ప్రధానంగానే కనిపిస్తుంది.