మరోసారి విలన్ పాత్ర లో అరవింద్ స్వామి..!!

murali krishna
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ బిజీగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ లను లైనప్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో..
అయితే చైతు చివరిగా నటించిన థాంక్యూ మూవీ ప్రేక్షకులను  బాగ నిరాశపరిచింది. అంతకు మందు వచ్చిన లవ్ స్టోరీ హిట్ అవ్వడంతో ఈ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లాల్ సింగ్ చెడ్డా అనే బాలీవుడ్ లో కీలక పాత్రలో చైతన్య నటించాడు. ఈ లో అమీర్ ఖాన్ స్నేహితుడిగా నటించాడు చైతూ.. అయితే ఈ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన  సంగతి తెలిసిందే, ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు చైతూ..
మాస్‌ అండ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ మూవీతో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని  ఈ యంగ్ హీరో చూస్తున్నాడు. దీంతో మేకర్స్‌ కూడా ఈ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య 22వ చిత్రంగా రానున్న ఈ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. ఇక ఈ కోసం స్టార్ కాస్ట్ ను తీసుకోనున్నారట. హీరోయిన్ ప్రియమణి ఈ  సినిమా లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. అలానే ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ లో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు అరవింద్ స్వామి నాగ చైతన్య 22 లో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే ఈ షూటింగ్ కు చిన్న ఇబ్బంది కూడా ఎదురైంది. ఈ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. చిత్రీకరణకు బ్రేక్‌ వేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్‌లో భాగంగా కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని చిత్రీకరణ జరపుతున్నారు. అయితే షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ ఓ వైన్స్‌ షాప్‌కి సంబంధించి వేసిన సెట్‌పై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమందట. త్వరలోనే ఈ నుంచి వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఈ  సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది అని చిత్ర బృందం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: