బిగ్ బాస్ బ్యూటీ సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతుందా..?

Pulgam Srinivas
తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది మంచి గుర్తింపు ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకొని ప్రస్తుతం టీవీ షోలలో ,  సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు నడిపిస్తున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ,  ప్రస్తుతం టీవీ షో లలో ,  సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దు గుమ్మ లలో దేత్తడి హారిక ఒకరు  దేత్తడి హారిక మొదట యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ,  ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక దేత్తడి హారిక పలు టీవీ షో లలో పాల్గొనడం మాత్రమే కాకుండా ,  పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ పెళ్లికి రెడీ అయినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దేత్తడి హారిక ఓ యూట్యూబర్ తో  ప్రేమలో ఉన్నట్లు ,  వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఇప్పటికే ఒకే చెప్పినట్లు ,  త్వరలోనే అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా దేత్తడి హారిక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: