ఎన్టీఆర్ - సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
1) ఎన్టీఆర్ - సావిత్రి :
ఈ జంట చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేశారు. అయితే రక్త సంబంధం సినిమాలో మాత్రం అన్నా చెల్లెళ్లుగా చేశారు.
2) చిరంజీవి - రమ్యకృష్ణ :
'చక్రవర్తి' సినిమాలో చిరుకి చెల్లిగా చేసిన రమ్యకృష్ణ 'అల్లుడా మజాకా' 'ముగ్గురు మొనగాళ్లు' వంటి సినిమాలో చిరుకి జోడీగా చేసింది.
3) కృష్ణ - సౌందర్య :
'నెంబర్ 1' తో సహా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ జంట 'రవన్న' సినిమాలో అన్న- చెల్లెలు గా చేశారు.
4) రాజేంద్ర ప్రసాద్ - రంభ :
'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. వీళ్ళే చిరంజీవి నటించిన 'హిట్లర్' సినిమాలో అన్న - చెల్లెలు గా నటించారు.
5) రమ్యకృష్ణ - నాజర్ :
'బాహుబలి'(సిరీస్) లో వీళ్ళు భార్యాభర్తలుగా చేశారు. అయితే అంతకు ముందు రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో అన్న చెల్లెలు గా కనిపించారు.
6) ప్రకాష్ రాజ్ - జయసుధ :
'బొమ్మరిల్లు' 'కొత్త బంగారు లోకం' 'మహర్షి' ఇలా చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా చేసిన ఈ జంట.. 'సోలో' సినిమాలో మాత్రం అక్క తమ్ముడుగా కనిపించారు.
7) సురేష్ - సౌందర్య :
'అమ్మోరు' సినిమాలో జంటగా నటించారు. అయితే వెంకటేష్ నటించిన 'దేవీపుత్రుడు' సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.
8) చంద్రమోహన్ - సుధ :
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో అన్నా చెల్లెలుగా కనిపించిన ఈ జంట.. రవితేజ నటించిన 'కృష్ణ' సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారు.
9) జగపతి బాబు - వాణి విశ్వనాథ్ :
'సింహ స్వప్నం' సినిమాలో జోడీగా నటించారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.
10) చిరంజీవి - నయనతార :
'సైరా' సినిమాలో భార్యాభర్తలుగా కనిపించారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన 'గాడ్ ఫాదర్' లో అన్న చెల్లెలు గా కనిపిస్తారు.