సంక్రాంతి కి దళపతి విజయ్ మూవీ పక్క..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వంశీ పైడిపల్లి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మున్నా మూవీతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ దర్శకుడు మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తరువాత బృందావనం , ఎవడు , ఊపిరి , మహర్షి వంటి పలు మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ దర్శకుడు కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల కాబోతోంది. తమిళ్ లో ఈ మూవీ వరసు అనే పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో ఈ మూవీ వారసుడు మూవీ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ,  ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.


ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాక పోతే ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు ,  ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసి ,  ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: